Share News

బీసీ బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:15 PM

బీసీ బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పెగడపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి సభలో పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి రాహుల్‌ గాంధీ సమక్షంలో ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్‌ ప్రకటించిందన్నారు.

బీసీ బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు

కాల్వశ్రీరాంపూర్‌, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): బీసీ బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పెగడపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కామారెడ్డి సభలో పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి రాహుల్‌ గాంధీ సమక్షంలో ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్‌ ప్రకటించిందన్నారు. బీసీ రిజర్వేషన్‌కు ఓర్వలేని బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కొందరిని ప్రోత్సహించి కోర్టుకు పంపారన్నారు. రిజర్వేషన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీలు శనివారం నిర్వహించ తలపెట్టిన బంద్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్దతు తెలుపుతుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 8 మంది బీజేపీ ఎంపీలో అక్కడో మాట, ఇక్కడో మాట మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య తదితరులు పాల్గొన్నారు.

బంద్‌ను విజయవంతం చేయండి...

ఫ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌

గోదావరిఖని, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్‌ బలోపేతంలో అందరూ ఏకమై ముందుకు సాగాలని తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతును తెలుపుతుందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ తెలిపారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర నిర్వహించి బీసీ కుల గణన చేయాలని ఆదేశించడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని, బీసీ బంద్‌ ద్వారా కేంద్రంలో బీజేపీకి కనువిప్పు కలగాలని, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బంద్‌ పిలుపునిచ్చిందని, బంద్‌లో సకలజనులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - Oct 17 , 2025 | 11:15 PM