అబద్దాలు, మోసాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:56 PM
అబద్దాలు, మోసాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని, అడ్డగోలు హామిలిచ్చి అమలు చేయకుండా ప్రజలను వచిం చింది రేవంత్ సర్కారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చం దర్ అన్నారు. అదివారం తిలక్‌నగర్ డౌన్‌లోని చందర్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోరుకంటి చందర్, నాయకులు కౌశిక హరి మాట్లా డారు.
గోదావరిఖని, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): అబద్దాలు, మోసాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని, అడ్డగోలు హామిలిచ్చి అమలు చేయకుండా ప్రజలను వచిం చింది రేవంత్ సర్కారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చం దర్ అన్నారు. అదివారం తిలక్‌నగర్ డౌన్‌లోని చందర్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోరుకంటి చందర్, నాయకులు కౌశిక హరి మాట్లా డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రత్య క్షంగా సంతకాలు చేసిన అభయహస్తం కార్డు పేరిట ప్రతి ఇంటికి అందించి నమ్మబలికి ఎన్నికల్లో గెలిచాక హామీలను అమలు చేయడం లేదని, దీనిపై స్థానిక ఎమ్మెల్యే మాక్కాన్‌సింగ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. 420హామీలు, ఆరు గ్యారెం టీలు ఇచ్చి, 100రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మి కులు, దివ్యాంగులకు డబుల్ పెన్షన్లు, ఆడబిడ్డల వివాహానికి తులం బంగారం, పాఠశాలలు, కళాశా లలకు వెళ్లే ఆడపిల్లలకు సైకిళ్లు, స్కూటీలు, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్, విద్యా భరోసా, ఉచిత కరెంట్, గ్యాస్ వంటి పథకాల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఉద్య మకారులకు 250చదరపు గజాల ఇంటి స్థలం, రూ.5 లక్షలు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. రాజీవ్ యువ కిరణాల పేరుతో నాలుగుసార్లు దర ఖాస్తులు తీసుకుని, ఇప్పుడు వాటి ఊసెత్తడం లేద న్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లోకి తీసు కెళ్లడానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, పార్టీ కార్య కర్తలు బాకీ కార్డును గడ పగడపకు తీసుకెళ్లి ప్రజ లను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసాలతో విసిగి పోయిన ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరు కుంటున్నారని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోవు ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతార న్నారు. అనంతరం డివి జన్‌లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను అం దించారు. మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషే క్‌రావు, చెలకలపల్లి శ్రీనివాస్, బొడ్డు రవీందర్, బొడ్డు పల్లి శ్రీనివాస్, ఇం జపురి నవీన్ కుమార్, మెతుకు దేవరాజ్, నారా యణదాసు మారుతి, నీరటి శ్రీనివాస్, మేడి సదానందం, దొమ్మేటి వాసు. సట్టు శ్రీనివాస్ బుర్ర వెంకటేష్, ఇరుగురాళ్ల శ్రావణ్, కోడి రామకృష్ణ, సారయ్య నాయక్, కొర్రీ ఓదెలు, సంధ్యారెడ్డి, చింటూ, కనకలక్ష్మి, గుర్రం పద్మ, రామరాజు పాల్గొన్నారు.