Share News

ఖనిలో కాంగ్రెస్‌ నాయకుల సంబరాలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:37 PM

రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలుపడంతో మంగళవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఖనిలో కాంగ్రెస్‌ నాయకుల సంబరాలు

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలుపడంతో మంగళవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గాన్ని మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పెట్టుకున్నారని, రామగుండం ప్రజల చిరకాల కోరిక అయిన 800మెగావాట్లకు మంత్రివర్గం ఆమోదం తెలుపడం హర్షనీయమన్నారు. విద్యుత్‌ ప్లాంట్‌ ఆమోద ముద్రవేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు కాల్వ లింగస్వామి, నాయిని ఓదెలు, పాతపెల్లి ఎల్లయ్య, ఫజల్‌ బేగ్‌, కొప్పుల శంకర్‌, ముస్తాఫా, బాల రాజ్‌కుమార్‌, గడ్డం శ్రీనివాస్‌, గట్ల రమేష్‌, తాళ్లపల్లి యుగంధర్‌, కళ్యాణి సింహాచలం, అనుమ సత్యనారాయణ, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:37 PM