Share News

కాంగ్రెస్‌దే పై‘చేయి’

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:19 AM

జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రత్యర్థులపై పై‘చేయి’ సాధించారు. మొదటి విడతలో జరిగిన మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ హవా రెండవ విడతలోనూ కొన సాగింది. కాంగ్రెస్‌ పార్టీ 51 స్థానాలు, బీఆర్‌ ఎస్‌ పార్టీ 14 స్థానాలు, స్వతంత్రులు 6 స్థానాల్లో, సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు గెలిచారు.

కాంగ్రెస్‌దే పై‘చేయి’

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రత్యర్థులపై పై‘చేయి’ సాధించారు. మొదటి విడతలో జరిగిన మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ హవా రెండవ విడతలోనూ కొన సాగింది. కాంగ్రెస్‌ పార్టీ 51 స్థానాలు, బీఆర్‌ ఎస్‌ పార్టీ 14 స్థానాలు, స్వతంత్రులు 6 స్థానాల్లో, సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు గెలిచారు. మొదటి విడతలో 65 స్థానాలతో కాంగ్రెస్‌ పార్టీ 125, బీఆర్‌ఎస్‌ పార్టీ 35, స్వతంత్రులు 17, సీపీఐఎంఎల్‌ ఒకరు, బీజేపీ ఒక స్థానం తో నిలబెట్టుకున్నది. భారతీయ జనతా పార్టీ మొదటి విడతలో ఖాతా తెరవక పోయినా రెండవ విడతలో జూలపల్లి మండలం కోన రావుపేట గ్రామ సర్పంచ్‌గా నల్ల నరేందర్‌ రెడ్డి విజయం సాధించారు. రెండవ విడతలో అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలు, 684 వార్డు స్థానాలకు గత నెల 30వ తేదీ న నోటిఫికేషన్‌ జారీ చేసి నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ధర్మారం మండలం బంజేరు పల్లి, బొట్లవనపర్తి, నాయకంపల్లి సర్పం చ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాలుగు మండలాల్లో కలిసి 177 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 73 గ్రామ పంచాయతీల్లో 70 సర్పంచ్‌ స్థానాలకు, 504 వార్డు స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరిగింది. 70 సర్పంచ్‌ స్థానాలకు 286 మంది అభ్యర్థులు, 504 వార్డు స్థానాలకు 1454 మంది అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు.

పోలింగ్‌ అనంతరం నిర్వ హించిన కౌంటింగ్‌లో అధికార పార్టీకి చెం దిన అభ్యర్థులు ఎక్కువ మంది విజయం సాధించారు. పాలకుర్తి మండలం జీడీ నగర్‌ పంచాయతీల్లో అత్తా కోడళ్ల మధ్య జరిగిన సమరంలో కోడలు సూర రమ గెలుపొందారు. కౌంటింగ్‌ పలు చోట్ల ఆలస్యంగా జరిగింది.

Updated Date - Dec 15 , 2025 | 12:19 AM