కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:25 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుందని, దీనిని ప్రజలు, రైతులు తిప్పికొ ట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
గోదావరిఖని, జూన్ 21(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుందని, దీనిని ప్రజలు, రైతులు తిప్పికొ ట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అపర భగీరథుడు కేసీఆర్ అని, కాశేశ్వరం ప్రాజెక్టు ఆరు సంవత్సరాలు పూర్తయ్యిందని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాత సముద్రంలో కలిసే నీటిని కేసీఆర్ ఒడిసిపట్టి గోదావరిని నిండుకుండలా మార్చారని, నేడు గోదావరి ఎడారిలా మారిందన్నారు.
తలాపున ఉన్న గోదావరి ఎండిపోతుందని ఆరు సంవ త్సరాల క్రితం కాళే శ్వరం ప్రాజెక్టును కట్టి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించారని, ప్రపం చంలో అతిపెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆరు వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం వరకు డ్యాములు నిర్మించి సముద్రా న్ని తలపించే విధంగా కేసీఆర్ చేస్తే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామరక్ష అనే నినాదంతో రామగుం డం నియోజకవర్గంలో కేసీఆర్ చేసిన పనులపై గ్రామాలకు వెళ్లి వివరించనున్నట్టు చెప్పారు. నాయకులు బాదె అంజలి, దేవరాజ్, కుమ్మ రి శ్రీనివాస్, సట్టు శ్రీనివాస్, విజయ్, వెంకటి, కిరణ్‌జీ పాల్గొన్నారు.