Share News

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:31 AM

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బదనాం చేయడానికి ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర

పెద్దపల్లిటౌన్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బదనాం చేయడానికి ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. అయ్యప్ప టెంపుల్‌ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం నీటితో అభిషేకం చేసి ఈశ్వర్‌ మాట్లాడారు. సుంకిశాల, ఎస్‌ఎల్‌బీ, పోల వరం ప్రాజెక్టు కూలిపోతే లేని కమిషన్‌ కాళేశ్వరం రెండు పిల్లర్ల కుంగితే కమిషన్‌ వేయడం సిగ్గుచేటన్నారు. కాళేశ్వరాన్ని విఫలయత్నంగా చూపిం చి గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నాడన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన కేసీఆర్‌ను బదనాం చేస్తున్నారని వివరించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయా లనే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చ డం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు చూపిస్తున్నారన్నారు. ప్రాజెక్టు నిర్మించిన ఎల్‌అండ్‌టీ సంస్థనే మరమతు చేసే బాధ్యత తీసుకుంటుందని చెప్పినా అనుమతి ఇవ్వకుండా, రేవంత్‌ రెడ్డి సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, నాయకుడు సిరిమిల్ల రాకేష్‌, పట్టణ అధ్యక్షుడు రాజ్‌ కుమార్‌, కొయ్యడ సతీష్‌ గౌడ్‌, వంగల తిరుపతిరెడ్డి, నూనెటి సంపత్‌, సందీప్‌ రావు, పార్టీ మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 12:31 AM