పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాట్లు పూర్తి చేయండి
ABN , Publish Date - May 23 , 2025 | 11:22 PM
ఎలిగేడులో ఏర్పాటు చేయనున్న పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝూ అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో ప్రారంభినున్న పోలీస్‌స్టేషన్ భవనాన్ని తనిఖీ చేశారు.
ఎలిగేడు, మే 23 (ఆంధ్రజ్యోతి): ఎలిగేడులో ఏర్పాటు చేయనున్న పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝూ అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో ప్రారంభినున్న పోలీస్‌స్టేషన్ భవనాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలోనే పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తామని సమయం ఎప్పు డనే విషయాన్ని తెలియజేస్తామని తెలిపారు. భవనంలోని గదులు, చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పూర్తిస్తాయిలో లైట్లను ఏర్పాటుచేసి అవసరం ఉన్నచోట రంగులు వేసి శుభ్రంగా ఉంచాలన్నారు. భవన పరిసరాలను పరిశీలించారు. సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్ప్‌క్టర్ సుబ్బారెడ్డి, జూలపల్లి ఎస్సై సనత్‌కుమార్, పీసీలు పవన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం
సుల్తానాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి కృషి చేస్తామని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం రాత్రి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్‌ను పరిశీలించారు. సీపీ మాట్లాడుతు ఫిర్యాదు చేయడానికి వచ్చే వారితో గౌరవంగా మాట్లాడా లని, త్వరితగతిన సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్ పరిధిలోని 27 గ్రామాలు, మున్సిపాలిటీ గురించి ఎస్‌ఐ శ్రావణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదీ లేద ని, వరుసగా రౌడీయిజానికి పాల్పడేవారిపై రౌడీషీట్ తెరువాలని ఆదేశిం చారు. రైస్‌మిల్లులో పని చేసే ఇతర రాష్ట్రాల వారి పూర్తి సమాచారం సేకరిం చాలని, నేరస్తుల పై నిఘా ఉంచాలన్నారు. రైల్వేలైన్, జాతీయ రహదారి లపై జరిగే ప్రమాదాల గురించి అప్రమత్తంగా ఉండాలన్నారు.