Share News

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:51 PM

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల పక్షాన పరిహారం ఇప్పించే వరకు బీజేపీ అం డగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 10 (ఆం ధ్రజ్యోతి): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల పక్షాన పరిహారం ఇప్పించే వరకు బీజేపీ అం డగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాలు కురిసే పరిస్థితుల్లో కొనుగోలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ధాన్యం నాణ్యత ఎలా ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. యాసంగి, వానాకా లంలో సన్నవడ్లకు 5 వందల రూపాయల బోనస్‌ వెంటనే చెల్లించాలన్నారు.

ఫసల్‌ బీమా యోజన పథకం రాష్టంలో అమలు చేసి ఉంటే రైతులకు నష్టపరిహారం వచ్చేదన్నారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సిద్ధంగా ఉందన్నారు. దళారులను నమ్మి రైతులు పంటను తక్కువ ధరకు అమ్మి మోసపో వద్దని విజ్ఞప్తిచేశారు. ప్రధాని ఆదేశాల మేరకు చివరి క్వింటాల్‌ వరకు పత్తిని కొనుగోలు చేస్తామ న్నారు. గోదావరిఖనిలో రోడ్డు విస్తరణ పేరుతో దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని ఖం డించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానం దం, కడారి అశోక్‌ రావు, కార్యదర్శులు నారాయణ స్వామి, శివంగారి సతీష్‌, రమేష్‌ తదితరులున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:51 PM