రోడ్డు ప్రమాద మృతులకు పరిహారం ఇవ్వాలి
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:23 AM
ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో గాం ఛలో-బస్తీ ఛలోలో భాగంగా ఆయన పర్యటించారు. బైక్‌ర్యాలీ నిర్వహించి అంగన్వాడీ సెంటర్‌ను, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని తనిఖీ చేశారు.

కమాన్‌పూర్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఇసుక లారీలు ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో గాం ఛలో-బస్తీ ఛలోలో భాగంగా ఆయన పర్యటించారు. బైక్‌ర్యాలీ నిర్వహించి అంగన్వాడీ సెంటర్‌ను, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని తనిఖీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకులు సత్తాచాటాలన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే తెలం గాణాలో నిరుద్యోగ సమస్యతోపాటు ప్రతీ సమస్యను తీరుస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఇసుక, నల్లమట్టి అక్రమరవాణా జరిగిన పట్టించుకునే నాధుడు కరువయ్యాడన్నారు. మండలశాఖ అధ్యక్షుడు కొయ్యడ సతీష్, మట్ట శంకర్, దండె లక్ష్మీనారాయణ, మత్స్యగిరి రాము, జంగేపల్లి మొండయ్య, బర్ల రమేష్, బర్ల సదయ్య, సాగంటి లక్ష్మణస్వామి, కొమ్ము శ్రీనివాస్, పాల్గొన్నారు.