ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలి
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:25 AM
గోదావరి వరదలో మునిగిపోయిన పంటలను వెంటనే సర్వే చేయించి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు పరిహారం చెల్లించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. ఆదివారం పోతారం, విలోచవరం గ్రామాల్లో గోదావరి నది వరద ఉధృతికి మునిగిపోయిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు.
మంథనిరూరల్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): గోదావరి వరదలో మునిగిపోయిన పంటలను వెంటనే సర్వే చేయించి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు పరిహారం చెల్లించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. ఆదివారం పోతారం, విలోచవరం గ్రామాల్లో గోదావరి నది వరద ఉధృతికి మునిగిపోయిన పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులు తమకు జరిగిన పంట నష్టంను ఆయనకు వివరించారు.
ఆయన మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పంటలకు ఇన్సూరెన్స్ చేయిస్తా మని, గిట్టుబాటు ధర కల్పిస్తామని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నట్టేట ముంచారని అన్నారు. మంథని ఎమ్మె ల్యేకు రైతులను అదుకోవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రజలు, రైతులపక్షాన పోరాటం చేస్తుంటే పోలీసులతో అణిచి వేయాలని భయభ్రాంతులకు గురి చేస్తే భయపడేది లేదన్నారు. బీఆర్‌ఎస్ నేతలు, రైతులు పాల్గొన్నారు.