Share News

రైతులకు పరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్‌ ముట్టడి

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:39 PM

తుఫాను వల్ల పంటలను కోల్పో యిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తా మని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. కొలనూర్‌లో మీస అర్జున్‌ రావు, గొట్టేముక్కుల సురేష్‌ రెడ్డి, నల్ల మనోహర్‌ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు.

రైతులకు పరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్‌ ముట్టడి

ఓదెల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): తుఫాను వల్ల పంటలను కోల్పో యిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తా మని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. కొలనూర్‌లో మీస అర్జున్‌ రావు, గొట్టేముక్కుల సురేష్‌ రెడ్డి, నల్ల మనోహర్‌ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, కేంద్రాలలో రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. అధికారులు స్పం దించి తేమ శాతంతో పని లేకుండా కొనుగోలు చేయాలని కోరారు.

ఓదెలతోపాటు సుల్తానాబాద్‌, ఎలిగేడు, జూలపల్లి, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్‌ మండలాల్లో వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిం దన్నారు. సర్వే నిర్వహించి వరి ఎకరానికి రూ.35 వేలు, పత్తి పంటకు రూ.50 వేల పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సౌధర మహేందర్‌, కునారపు రేణుక దేవి, పుల్ల సదయ్య, రాగిడి శ్రీనివాసరెడ్డి, రంజిత్‌ రెడ్డి, అనిల్‌ రావు,చర్లపల్లి రాజుతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 11:39 PM