Share News

ప్రజల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:04 AM

ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పేర్కొన్నారు. ఆర్‌.కే గార్డెన్స్‌లో శనివారం 245 మంది లబ్ధిదారులకు కోటి 7 లక్షల 57 వేల 756 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

ప్రజల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పేర్కొన్నారు. ఆర్‌.కే గార్డెన్స్‌లో శనివారం 245 మంది లబ్ధిదారులకు కోటి 7 లక్షల 57 వేల 756 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ ఊరట కలుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు ఒక్కో రకం బెడ్‌ షీట్‌లను వినియోగించడం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం శరవేగంగా సాగుతోందన్నారు. అర్హులకు రేషన్‌ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఉచిత విద్యుత్‌ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తహసీల్దార్లు, నాయకులు గోపగాని సారయ్య గౌడ్‌, నూగిల్ల మల్లయ్య, బొడ్డుపల్లి శ్రీనివాస్‌, బూతగడ్డ సంపత్‌, రాజేశ్వర్‌ రెడ్డి, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ లు, పాల్గొన్నారు

Updated Date - Dec 28 , 2025 | 12:04 AM