జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:51 PM
జాప్యం లేకుండా కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సేవలను ఉద్యోగులకు అందించేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్ హరి పచౌరి అన్నారు. మంగళవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లను ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావుకు అందజేశారు.
రామగిరి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జాప్యం లేకుండా కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సేవలను ఉద్యోగులకు అందించేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్ హరి పచౌరి అన్నారు. మంగళవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్యోగులకు రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌లను ఆర్జీ-3 జీఎం సుధాకర్‌రావుకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎంపీఎఫ్ లావాదేవీలు సి-కేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు మధ్యవర్తుల లేకుండా సీఎంపీఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని తెలిపారు. అనంతరం క్లెయిమ్స్, రివైజ్డ్ పెన్షన్‌పై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేశారు. పెండింగ్ చర్యలు జీరో పెండింగ్ స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని తెలిపారు. జీఎం సుధాకర్‌రావు మాట్లాడుతూ సీఎంపీఎఫ్ ఉద్యోగులు, సింగరేణి అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా సూచించారు. అధికారులు సుదర్శనం, సురేఖ, సునీల్‌ప్రసాద్, రాజేశం, మనోజ్, కామేశ్వర్‌రావు, అనిత, మనోహర్, ప్రదీప్‌రెడ్డి, గనుల సంక్షేమాధికారులు పాల్గొన్నారు.