డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:33 PM
దేశంలో అట్టర్ ప్లాప్ సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచాడని, ప్రజల కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పెద్దపల్లిటౌన్, నవంబరు 21 (ఆంఽధ్రజ్యోతి): దేశంలో అట్టర్ ప్లాప్ సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచాడని, ప్రజల కష్టాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న డ్రామా అన్నారు. ప్రజలు, మీడియా దృష్టి మరల్చేందుకే రాష్ట్రంలో బీజేపీతో కలిసి కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండేళ్ళ సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాల నపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల్లో దోషిగా నిలబెట్టారని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేక హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ చేసిన కేటీఆర్‌పై కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకినట్లుగా కేటీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాడన్నారు. గ్రామాల్లోకి వెళితే ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాల న్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక గొంతు నొక్కితే పదిగొం తులు లేస్తాయన్నారు. అలవికాని హామీలు చేసి ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క హామీ నెర వేర్చలేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ-కార్ రేస్‌ను కేటీఆర్ తీసుకువచ్చారన్నారు. కొద్ది రోజుల్లో జరగ నున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలకు తెగబడుతున్నారని ఆరోపించారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో మాటలతో కాలయాపన చేస్తూ సమస్యలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. గోపు ఐలయ్య యాదవ్, ఉప్పు రాజ్‌కుమార్, నారాయదాస్ మారుతి, అడప శ్రీనివాస్, బొండ్ల అశోక్, మెతుకు దేవరాజ్, కృష్ణవేణి, కవిత, సరోజిన, బాదె అంజలి, కనకలక్ష్మీ తదితరులున్నారు.