ఆలయాల మూసివేత
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:41 PM
చంద్రగ్రహణం సం దర్భంగా ఆదివారం అర్చకులు బ్రమరాంభ మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని మూసివే శారు. చంద్ర గ్రహణం సంద ర్భంగా ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి ఆలయ దర్శనాలను బంద్ చేశారు. తిరిగి సోమవారం ఉదయం 9 గంటలకు ఆలయం సంప్రో క్షణ అనంతరం నిత్యాభిషేకం తరువాత భక్తులకు ప్రవేశం ఉంటుందని ఈవో సదయ్య తెలిపారు.
ఓదెల, సెప్టెంబరు 7 (ఆం ధ్రజ్యోతి): చంద్రగ్రహణం సం దర్భంగా ఆదివారం అర్చకులు బ్రమరాంభ మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని మూసివే శారు. చంద్ర గ్రహణం సంద ర్భంగా ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి ఆలయ దర్శనాలను బంద్ చేశారు. తిరిగి సోమవారం ఉదయం 9 గంటలకు ఆలయం సంప్రో క్షణ అనంతరం నిత్యాభిషేకం తరువాత భక్తులకు ప్రవేశం ఉంటుందని ఈవో సదయ్య తెలిపారు.
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పుణ్య క్షేత్రమైన ఆదివరాహ స్వామి ఆలయాన్ని అర్చకులు ఆదివారం మూసి వేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయాన్ని మూసివేయగా మళ్లీ సోమ వారం ఉదయం తెరవనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయ సంప్రో క్షణ అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం ఉంటుందని పేర్కొ న్నారు. పలు గ్రామాల్లోగల ఆలయాలను పండితులు మూసివేశారు.
మంథని, (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు ఆలయాలను చంద్రగహ ణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పూజారులు మూసి వేశారు. రాత్రి గ్రహణం కావడంతో మధ్యాహ్నం ఆలయాల్లో సాయంత్రం, రాత్రి నిర్వహించే కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆలయాలను మూసి వేశా రు. దీంతో పట్టణంలోని గణపతి, శివాలయాలు, వైష్ణవ, అమ్మవారి, హనుమాన్, అయ్యప్ప, సాయి, దత్త, బ్రహ్మంగారి ఆలయాలు మూసి వేశారు. సోమవారం ఉదయం ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం భక్తలకు దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.