గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలి
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:17 PM
గ్రామాల్లో పరిశుభ్రత పాటిస్తూ పన్నులు కూడా వసూళ్లు చేయాలని జిల్లా పంచాయతీ అధి కారి వీరబుచ్చయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లతో సమావే శం నిర్వహించారు.
పెద్దపల్లి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పరిశుభ్రత పాటిస్తూ పన్నులు కూడా వసూళ్లు చేయాలని జిల్లా పంచాయతీ అధి కారి వీరబుచ్చయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లతో సమావే శం నిర్వహించారు. పన్నుల వసూళ్లు, పారిశుధ్య నిర్వహణ, విజిబుల్ క్లీనింగ్, సెగ్రిగేషన్ల నిర్వహణ, దోమల నివారణకు ఫాగింగ్, సిటిజెన్ సర్వీసెస్ నిర్వహణ, ట్రేడ్ లైసెన్సుల క్లియరెన్స్, తాగునీటి సరఫరా అంశాలపై చర్చించారు.
అనంతరం డీపీవో మాట్లాడుతూ విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు చెత్తను సేకరించాలని, డంపింగ్ యార్డుల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరాలో తలెత్తే ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్క రించాలన్నారు. లక్ష్యాల మేరకు పన్నుల వసూళ్లు చేపట్టాలన్నారు. జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి రాజేశ్వర్, మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్, పెద్దపల్లి, మంథని డీఎల్‌పీఓలు పాల్గొన్నారు.