Share News

కోతుల బెడదకు చెక్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:56 PM

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో కోతుల బెడదను పరిష్కరిం చేందుకు నగర పాలక సంస్థ చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా రూ.10 లక్షల అంచనాతో ఒక కాంట్రా క్టర్‌కు పనులు అప్పగించారు. ఒక్కో కోతికి రూ.850చొప్పున చెల్లించేందుకు నిర్ణయించారు.

కోతుల బెడదకు చెక్‌

కోల్‌సిటీ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో కోతుల బెడదను పరిష్కరిం చేందుకు నగర పాలక సంస్థ చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా రూ.10 లక్షల అంచనాతో ఒక కాంట్రా క్టర్‌కు పనులు అప్పగించారు. ఒక్కో కోతికి రూ.850చొప్పున చెల్లించేందుకు నిర్ణయించారు. కార్పొరేషన్‌ పరిధిలోని డివిజన్లలో కోతులు పట్టి వాహనాల్లో తరలించి అడవుల్లో వదిలి పెట్టాల్సి ఉంటుంది.

రామగుండం రైల్వే స్టేషన్‌ ఏరియా, గోదావరిఖని సింగరేణి స్టేడియం ఏరియా తదితర ప్రాంతాల్లో కోతులను పడుతున్నారు. మంగళవారం సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో బోన్లు పెట్టి కోతులు పట్టారు. కార్పొరేషన్‌ పరిధిలోని చాలా కాలనీల్లో కోతుల బెడద ఉంది. తిలక్‌నగర్‌, గాంధీనగర్‌, విద్యానగర్‌, పవర్‌హౌస్‌కాలనీ, ఐబీకాలనీ ప్రాంతాల్లో కోతులు విపరీతంగా ఉన్నాయి. చిన్న పిల్లలు, మహిళలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. ఈ బెడదను పరిష్కరించాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నారు. కోతుల బెడదపై తమకు సమాచారం ఇవ్వాలని, కార్పొరేషన్‌ కాల్‌ సెంటర్‌ 9603666444కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Updated Date - Jun 17 , 2025 | 11:56 PM