నాణ్యత లోపంతోనే కృంగిన చెక్‌డ్యామ్
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:35 PM
గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల మానేరు వాగుల్లోని ఎనిమిది చెక్ డ్యాములు కృంగిపోయాయని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గుంపుల వాగులో కృంగిన చెక్ డ్యామును ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు పరిశీలించారు.
ఓదెల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల మానేరు వాగుల్లోని ఎనిమిది చెక్ డ్యాములు కృంగిపోయాయని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. గుంపుల వాగులో కృంగిన చెక్ డ్యామును ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజ యరమణారావు పరిశీలించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో 13 చెక్‌డ్యాంలు నిర్మించగా ఎనిమిది చెక్ డ్యాములు నాణ్యత లోపం వల్ల కృంగిపోయా యని తెలిపారు. చెక్‌డ్యామ్‌కు బాంబులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు కనబడలేదని తెలిపారు. డ్యాముకు మధ్యలో, అలాగే ముందు భాగంలో బుంగలు ఏర్పడడం వల్ల చెక్ డ్యాం కూలిపోయిందని తెలిపారు.
ఎమ్మెల్యే వెంట సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, పడాల రాజు, సింగల్ విండో డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్, రెడ్డి రజినీకాంత్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.