Share News

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:51 PM

వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళ శక్తికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఐలమ్మ జయంతి వేడుకల్లో కలె క్టర్‌ పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు25 (ఆంధ్రజ్యోతి): వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మహిళ శక్తికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఐలమ్మ జయంతి వేడుకల్లో కలె క్టర్‌ పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఐలమ్మ సంఘ సేవకురాలుగా, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమతో వీరవనితగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. సమాజహితం కోసం పోరాటం చేసిన మహనీయుల స్ఫూర్తి, వారి జయంతి, వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలి పారు. జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి రంగారెడ్డి, రజక సంఘ నాయకులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తిలక్‌నగర్‌లోని ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు నివాళు లర్పించారు. పూలమాలలు, కేక్‌ కట్‌ చేసి ఉత్సాహంగా జరుపుకున్నారు. నాయకులు మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసిందన్నారు. కుల పెద్ద బొడ్డుపల్లి రామ్మూర్తి, గౌరవ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్‌, నవీన్‌, కుమారస్వామి, అశోక్‌, కృష్ణ, సంపత్‌, దొడ్డిపల్లి కొమరయ్య, మల్లికార్జున్‌, కనకయ్య, మాజీ కౌన్సిలర్లు భూతగడ్డ సంపత్‌, తాడూరి శ్రీమాన్‌, బిమోజు సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కోల్‌సిటీ: తెలంగాణ వీరవనిత, మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన ్నారు. కమిషన రేట్‌లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ పెత్తందారుల దురాగతాలను ఎండగడతూ, నిజాం నిరంకుశ రజాకార్లకు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాడారన్నారు. ఆమె చేసిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అన్నారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌, ఏఓ శ్రీని వాస్‌, ఇన్‌స్పెక్టర్లు భీమేష్‌, దామోదర్‌, వామనమూర్తి, పాల్గొన్నారు.

ధర్మారం: దొంగతుర్తిలో ఆజాది ఫెడరేషన్‌, రజక సంఘ నాయకులు చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. బీసీ ఆజాది ఫెడరేషన్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ముదాం శ్రావణ్‌ కుమార్‌, తమ్మడవేణి శ్రీనివాస్‌, రజక సంఘం అధ్యక్షుడు అలువాల రాజు, మందపల్లి సతీష్‌, గొట్టె లింగయ్య, బాణేష్‌, శాతరాజు తిరుపతి, అలువాల హనుమన్లు, ప్రశాంత్‌, లక్ష్మణ్‌, పాల్గొన్నారు.

కమాన్‌పూర్‌: మండలంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వ హించారు. బీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్‌గౌడ్‌, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ గుర్రం లక్ష్మిమల్లు, జూలపల్లి మాజీ ఉప సర్పంచ్‌ సాయికుమార్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు భూమయ్య, జూలపల్లి గ్రామయూత్‌ అధ్యక్షుడు దేవెందర్‌, జంగపల్లి వెంకటేశం, ఎల్లయ్య, కనకయ్య, చిన్న రవి, అజయ్‌, సారయ్య, కొమురయ్య, పాల్గొన్నారు.

మంథని: చాకలి ఐలమ్మ జయంతిని నివాళులర్పించారు. ఐలమ్మ విగ్రహానికి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్‌, నేతలు తగరం శంకర్‌లాల్‌, మాచీ రాజుగౌడ్‌ పూలమాలలు వేశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, నాయకులు నివాళులర్పించారు. కనవేన శ్రీనివాస్‌, కాయితి సమ్మయ్య, గొబ్బూరి వంశీ, ఆరెపల్లి కుమార్‌, పుప్పాల తిరుపతి, ఆకుల రాజబాబు, మంథని లక్ష్మణ్‌, ఏఎంసీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, పాల్గొన్నారు.

జ్యోతినగర్‌: పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షుడు పూసాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మేడిపల్లి సెంటరులో ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పిం చారు. ఈదునూరి మల్లేష్‌, భరత్‌గౌడ్‌, పైతరి రాజుమొండయ్య, గంగాధర్‌, రాజేశం, శ్రీనివాస్‌, కరుణాకర్‌, ఐలయ్య, సత్తయ్య, రాజయ్య, పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:51 PM