సీఈఐఆర్ పోర్టల్‌తో సెల్‌ఫోన్ల రికవరీ
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:50 PM
రామ గుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాధి తులు పోగొట్టుకున్న, చోరికి గురైన ఫోన్‌లను సీఈఐఆర్ అప్లికేషన్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రికవరీ చేశారు. బుధవారం రామ గుండం కమిషరేట్‌లో బాధితులకు అప్పగిం చేందుకు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహిం చారు.
కోల్‌సిటీ, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రామ గుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాధి తులు పోగొట్టుకున్న, చోరికి గురైన ఫోన్‌లను సీఈఐఆర్ అప్లికేషన్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రికవరీ చేశారు. బుధవారం రామ గుండం కమిషరేట్‌లో బాధితులకు అప్పగిం చేందుకు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహిం చారు. సీపీ అంబర్ కిశోర్ ఝా చేతుల మీదుగా రూ.18లక్షల విలువైన 120మొబైల్ ఫోన్‌లను బాధితులకు అప్పగించారు. సీపీ మాట్లాడుతూ చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ల ఆచూకిని కనిపెట్టేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, కమిషనరేట్‌లో సీసీఎస్ విచారణ జరుపుతుందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 6683ఫిర్యాదులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రాగా ఇందులో 2020 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగించామ న్నారు. ఇటీవల 120సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొన్నామన్నారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సీ రాజు, ఎస్‌బీ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బాబురావు, ఎస్‌ఐలు మధుసూధన్‌రావు, నరేష్, జీవన్, చంద్రశేఖర్, శివకేశవులు, శ్రీధర్, ఐటీకోర్ హెడ్ కానిస్టేబుల్ రాము పాల్గొన్నారు.