వేడుకలను వైభవంగా నిర్వహించుకోవాలి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:17 PM
దుర్గా నవరాత్రోత్సవాలను భక్తులు వైభవంగా నిర్వహించుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం జగదాంబ సెంటర్ వద్దనున్న దుర్గమాతను దర్శించుకున్నారు.
ఓదెల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : దుర్గా నవరాత్రోత్సవాలను భక్తులు వైభవంగా నిర్వహించుకోవాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం జగదాంబ సెంటర్ వద్దనున్న దుర్గమాతను దర్శించుకున్నారు. పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ హిందువుల ముఖ్యమైన పండుగ విజయదశమని, దీని పురస్కరించుకోని దేవి నవరాత్రులు పవిత్రంగా నిర్వహిస్తారని తెలిపారు.
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, మండల కన్వీనర్ కనికిరెడ్డి సతీష్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు బోడకుంట నరేష్, బుద్దే కుమారస్వామి, అలాగే చింతం మొగిలి, పోలోజు రమేష్, మాజీ ధర్మకర్తలు వెంకటస్వామి, కుమార్, తో పాటు పలువురు పాల్గొన్నారు.