Share News

త్వరలోనే యాసంగి సన్నాల బోనస్‌ చెల్లింపు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:50 PM

రైతులు ఎదురు చూస్తున్న యాసంగి సన్నరకం ధాన్యానికి బోనస్‌ డబ్బు లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఎమ్మెల్యే విజయరమ ణారావు అన్నారు. గురువారం పొత్క పల్లిలో మార్క్‌ఫెడ్‌ కేంద్రంతోపాటు ధాన్యం కొను గోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అద నపు కలెక్టర్‌ వేణుతో కలిసి ప్రారం భిం చారు.

త్వరలోనే యాసంగి సన్నాల బోనస్‌ చెల్లింపు

ఓదెల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎదురు చూస్తున్న యాసంగి సన్నరకం ధాన్యానికి బోనస్‌ డబ్బు లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఎమ్మెల్యే విజయరమ ణారావు అన్నారు. గురువారం పొత్క పల్లిలో మార్క్‌ఫెడ్‌ కేంద్రంతోపాటు ధాన్యం కొను గోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అద నపు కలెక్టర్‌ వేణుతో కలిసి ప్రారం భిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ధాన్యంలో తేమ శాతం తగ్గిన తర్వాతనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. మక్కలకు 14శాతం, ధాన్యంలో 17 శాతం తేమ ఉండాలని తెలిపారు. ధాన్యంలో కోత ఉండదని, కోత పెడితే దృష్టికి తీసుకురావాలని కోరారు.

తడిసిన, మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని, కొంత జాప్యం అయినప్పటికీ బోనస్‌ డబ్బులు చెల్లిస్తామన్నారు. గ్రంథాలయ చైర్మన్‌ అంతటి అన్నయ్య, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ ఈర్ల స్వరూప, తహసీల్దార్‌ ధీరజ్‌ కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాష్‌ రావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ళ సుమన్‌ రెడ్డి, మాజీ సర్పం చులు దాసరి రాజన్న, పడాల రాజు, అలాగే రౌతు మనోజ్‌ క్రాంతివీర్‌, మాజీ ఎంపీటీసీలు చిన్నస్వామి, ఉడిగ సదయ్య, బోడకుంట శంకర్‌, చొప్పరి అల్లం సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:50 PM