రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద వైఖరి
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:44 PM
రిజర్వేషన్ల ప్రక్రియ కేంద్ర ప్రభు త్వం చేస్తున్న ద్వంద విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివారం ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని సెంటినరీకాలనీలో సిఐటియు(సిపిఐ) ఆధ్వర్యంలో నల్లజెండాల తో నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కార్యదర్శి ముత్యంరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని తీర్మానం ప్రవేశపెట్టి గవర్నర్‌కు పంపినా ఆమోదం తెలుపలేదన్నారు.
రామగిరి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్ల ప్రక్రియ కేంద్ర ప్రభు త్వం చేస్తున్న ద్వంద విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివారం ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని సెంటినరీకాలనీలో సిఐటియు(సిపిఐ) ఆధ్వర్యంలో నల్లజెండాల తో నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కార్యదర్శి ముత్యంరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని తీర్మానం ప్రవేశపెట్టి గవర్నర్‌కు పంపినా ఆమోదం తెలుపలేదన్నారు. బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉందని స్పష్టం అవుతుందన్నారు. బీజేపికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు చొరవ తీసుకొని రిజర్వేషన్ల ప్రక్రియను వేగ వంతం చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు దొమ్మటి కొంరయ్య, నాయకులు కుమార్, వెంకటేశ్వర్లు, ఆహ్మద్‌పాషా, రమణారెడ్డి, రాయ మల్లు, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.