ఎన్నికలు ఏవైనా గెలుపు బీజేపీదే
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:15 AM
ఎన్నికలు ఏవైనా గెలుపు బీజేపీదేనని జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల, రూరల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
సుల్తానాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ఏవైనా గెలుపు బీజేపీదేనని జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల, రూరల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో ఒరిగిందేమి లేదన్నారు. ప్రజలు విసిగి వేసారిన అనంతరం మార్పు కోరి అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్‌కు అవకాశం కల్పిస్తే రెండేళ్లలోనే పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.
మంత్రులు ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారే తప్ప రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రం ఇస్తున్న పథకాలను రాష్ట్రం తామే ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. గడపగడపకు బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, సీనియర్ నాయకులు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్‌రావు, మహేందర్ యాదవ్, శాతరాజు రమేష్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, రాజేంద్రప్రసాద్, వేగోళం శ్రీనివాస్ గౌడ్, వేల్పుల రాజన్న పటేల్, కొమ్ము చిన్న తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.
కరీంనగర్ శాన్వి డిఫెన్స్ అకాడమీ విద్యాసంస్థల అధినేత మియాపూర్ గ్రామానికి చెందిన నెర్రంశెట్టి మునీందర్‌తోపాటు పలువురు బీజేపీలో చేరారు. జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీరెడ్డి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.