Share News

బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:50 PM

బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రిజర్వేషన్‌ బిల్లును అసెంబ్లీలో తీర్మాణానికి బీజేపీతో పాటు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు.

బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రిజర్వేషన్‌ బిల్లును అసెంబ్లీలో తీర్మాణానికి బీజేపీతో పాటు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. ముఖ్యమంత్రి ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపగా ఢిల్లీకి పంపించారని, దానిని ఆమోదించేందుకు అన్ని పార్టీలకు ఆహ్వానం పలికి ఢిల్లీ వెళ్తే బీజేపీ నేతలు రాలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి రిజర్వేషన్లు అమలు అయ్యోలా చూడాల్సిందిపోయి కాం గ్రెస్‌ ప్రభుత్వాన్ని బదునాం చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. బీసీల రిజర్వేషన్‌ అమ లుకు అడ్డంకులు తేస్తున్నది ఎవరనేది ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఎన్ని నిధులు తీసుకువచ్చారో, ఆంధ్రప్రదేశ్‌లో 4 ఎంపీలు ఎన్ని నిధులు తీసుకువచ్చారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. రానున్న స్థానిక సంస్థల్లో బీజేపీ అడ్రస్‌ గల్లంతవుతుందన్నారు. బండారి రాం మూర్తి, బూతగడ్డ సంపత్‌, శ్రీనివాస్‌, ఎరుకల రమేష్‌, తూముల సుభాష్‌ తదితరులున్నారు.

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

పట్టణంలోని చీకురాయి చౌరస్తా నుంచి మొదటి రైల్వేగేటు వరకు జరుగుతున్న డబుల్‌ రోడ్డు పనులను ఎమ్మెల్యే విజయ రమణారావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు 3.5 కోట్ల రూపాయలతో చేపట్టామని, అలాగే డ్రైనేజీ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. దీంతో ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల రాకపోకలకు వీలుగా ఉంటుందన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పెద్దపల్లి పర్యటనకు వచ్చినప్పుడు 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఆ పనులను త్వరలో ప్రారంభి స్తామని, పెండింగ్‌ ఉన్న పనులు పూర్తి చేస్తామని, అమృత్‌ 2.0 పథకం కింద ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా శం కుస్థాపన చేసుకున్న వాటర్‌ ట్యాంకులు నిర్మి స్తున్నామన్నారు. పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ ఈర్ల స్వరూప, మున్సిపల్‌ ఏఈ సతీష్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నరేష్‌, వినయ్‌, కిరణ్‌ మున్సిపల్‌ సిబ్బంది మాజీ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Oct 10 , 2025 | 11:50 PM