Share News

ఢిల్లీలో గెలుపుతో బీజేపీ సంబరాలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:50 PM

దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ గెలుపుతో నాయకులు శనివారం సంబరాలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి సుల్తానాబాద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మోసపూరితమైన హమీ లు ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.

ఢిల్లీలో గెలుపుతో బీజేపీ సంబరాలు

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 8: (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ గెలుపుతో నాయకులు శనివారం సంబరాలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి సుల్తానాబాద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మోసపూరితమైన హమీ లు ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఢిల్లీ ఎన్నికలలో మూడోసారి అధికార అంటూ విర్రవీగిన కేజ్రీవాల్‌ను ఘోరంగా ఓడించారన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ మరో సారి జీరోగా మిగిలిందన్నారు. తెలంగాణాలో అధికారంలో ఉండడానికి కాంగ్రెస్‌ పార్టీకి అర్హత లేదన్నారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచారు. కూకట్ల నాగరాజు, కందుల శ్రీనివాస్‌, సౌదరి మహేందర్‌ యాదవ్‌, రమేష్‌, కొమ్ము తిరుపతి,ఎల్లంకి రాజు, రాజేంద్రప్రసాద్‌, పాల్గొన్నారు

ఎలిగేడు,(ఆంఽధ్రజ్యోతి): మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌక్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. నాయకులు గర్రెపల్లి నారాయణస్వామి, గాదె రంజిత్‌రెడ్డి, వెంకటరమణారావు, అసంపల్లి రవి, శివపల్లి సత్యం, తిరుపతి, అమరగండ గంగయ్య, గుజ్జుల మల్లారెడ్డి, రాయపాక మనోహర్‌, పాల్గొన్నారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి) : దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంపై కొలనూర్‌లో సంబరాలు నిర్వహించారు. నాయకులు బాణసంచా పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. తాజోద్దిన్‌, కొంగరి అనిల్‌, పుల్ల సదయ్య, రజనీకర్‌ రెడ్డి, గోపు మల్లారెడ్డి, డా.వెంకన్న, పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును హర్షిస్తూ గోదావరిఖని చౌరస్తాలో బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి మిఠా యిలను పంపిణీ చేశారు. రామగుండం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి, రాష్ట్ర నాయకుడు మేరుగు హన్మంతుగౌడ్‌ మాట్లాడుతూ దేశంలో బీజేపీ విజయాలతో దూసుకుపోతుందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాక పోవడంతో ఆ పార్టీ దుస్థితికి అద్ధం పడుతుందన్నారు. నాయకులు కోమళ్ల మహేష్‌, జక్కుల నరహరి, కోడూరి రమేష్‌, భూమయ్య, సతీష్‌, సంజీవ్‌, స్వామి, అపర్ణ, పద్మ, శ్యామ్‌, పాల్గొన్నారు. బీజేపీ సీనియర్‌ నాయకులు మహవాది రామన్న ఆధ్వర్యంలో చౌరస్తాలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. సుల్వ లక్ష్మీనర్సయ్య, జక్కుల నరహరి, గోపగోని నవీన్‌, శివరాం, కిషన్‌రావు, సతీష్‌, శ్రావణ్‌, గాండ్ల స్వరూప, సంపత్‌, రాకేష్‌ పాల్గొన్నారు.

పెద్దపల్లిటౌన్‌, (ఆంధ్రజ్యోతి): అవినీతిలో కూరుకుపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని బీజేపీ దళితమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం అన్నారు. ఢిల్లీలో బీజేపీ గెలుపుతో జిల్లా కేంద్రంలో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకు న్నారు. సదానందం మాట్లాడుతూ దేశ ప్రజల్లో విద్వేషం నింపడమే లక్ష్యంగా కుఠిల రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీ ఎన్నికలు కోలుకోలేని దెబ్బని, రాహుల్‌గాంధీ అసమర్థతకు తార్కాణమని పేర్కొ న్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి బలోపేతం అవుతామని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు పర్శ సమ్మయ్య, జంగా చక్రధరరెడ్డి, క్రాంతి కుమార్‌, బెజ్జంకి దిలీప్‌ కుమార్‌, శివంగారి సతీష్‌, కరుణాకర్‌, రాజవీర్‌ గౌడ్‌, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మోర మనోహర్‌, రాజం కొమురయ్య, ఎండి ఫహీం, నర్సింగం, పాల్గొన్నారు.

కమాన్‌పూర్‌,(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబ రాలు జరుపుకున్నారు. గ్రామాలలో స్వీట్లు పంపిణీ చేశారు. మోదీ నాయకత్వంలో దేశంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొయ్యడ సతీష్‌, రాము, మట్ట శంకర్‌, జంగాపల్లి అజయ్‌, మల్లారపు అరుణ్‌కుమార్‌, తిరుపతి, విశ్వతేజ, రాజలింగు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:50 PM