ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలను పెంచాలి
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:31 AM
ప్రభుత్వాసు పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం అడ్డగుంటపల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణీలకు ప్రస వాలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేస్తూ వివరాలు నమోదు చేయాలని, ప్రసవానికి సమీపంలో ఉన్న గర్భిణీల తో మాట్లాడి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడా లని వైద్య సిబ్బందికి సూచించారు.

కళ్యాణ్‌నగర్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసు పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం అడ్డగుంటపల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణీలకు ప్రస వాలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేస్తూ వివరాలు నమోదు చేయాలని, ప్రసవానికి సమీపంలో ఉన్న గర్భిణీల తో మాట్లాడి ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం జరిగేలా చూడా లని వైద్య సిబ్బందికి సూచించారు. గర్భిణీలకు పౌష్టికాహా రాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రసవాల సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ఆసుపత్రికి వచ్చే షుగర్, బీపీ రోగులను పరీక్షలు చేసి వారికి మందులను అందించాలని సూచించారు. ఆరోగ్య కేంద్ర పరిధిలో టీబీ అనుమానితులందరికి నిర్ధారణ పరీ క్షలు జరిగేలా చూడాలని, ఎన్‌సీడీ సర్వే పూర్తి చేసి అబా కార్డులను జనరేట్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలిం చారు. అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అరుణశ్రీ, ప్రైమర్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి మాణికేశ్వర్‌రెడ్డి, సూపర్‌వైజర్ అనిత ఉన్నారు.
మార్చి20లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
కోల్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మార్చి 20వ తేదిలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళ వారం టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్‌లో రూ.29కోట్ల అంచనాలతో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. జీఎం కాలనీ సమీపంలో రాజీవ్ రహదారి నుంచి ఐబీ కాలనీ వరకు నిర్మిస్తున్న డ్రైన్‌ను పరిశీలించారు. కాంట్రా క్టర్లు పనులు వేగంగా చేస్తు న్నందున వారి బిల్లులు కూడా త్వరితగతిన రికార్డు చేయా లన్నారు. ఆధునీకరణ తరువాత నాలాల భూములను పరిరక్షిం చాలని, నాలాల పక్కన వాకింగ్ ట్రాక్‌లు నిర్మించాలని ఆదేశిం చారు. టీబీ శిబిరాన్ని పరిశీలిం చారు. జనం అధికంగా గుమి గూడకుండా ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహించాల న్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ ఎస్‌ఈ శివా నంద్, ఈఈ రామన్, ప్రైమరీ హెల్త్ వైద్యాధికారి మాణికేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
కుందనపల్లి అర్బన్ పార్కును సందర్శన
అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): అంతర్గాం మండల పరిధిలోని కుందనపల్లి శివారులో గల అర్బన్ ఫారెస్ట్ పార్కును మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. కలెక్టర్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సందర్శకుల సంఖ్య పెరిగేలా మరిన్ని మొక్కలు నాటాలని జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్యను ఆదేశించారు. గేట్ ఆర్చ్, వాకింగ్ ట్రాక్ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి నాగయ్య, సారేదార్ ఎండీ రహ్మతుల్లా, ఎండీ ఇర్షద్, అటవీశాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.