Share News

బయో మెడికల్‌ వ్యర్థాలను సక్రమంగా డిస్పోజల్‌ చేయాలి

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:30 PM

బయోమెడికల్‌ వ్యర్థా లను మున్సిపల్‌ వ్యర్థాలతో కలిపితే కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులకు సూచించారు. శుక్రవారం రామగుండం మున్సిపల్‌ పరిధి లోని ఆసుపత్రి నిర్వాహకులతో ఎన్టీపీసీలోని ఈడీసీ మిలీనియం హాల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, డెంటల్‌ క్లినిక్స్‌, స్కాన్‌ సెంటర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

బయో మెడికల్‌ వ్యర్థాలను సక్రమంగా డిస్పోజల్‌ చేయాలి

జ్యోతినగర్‌, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): బయోమెడికల్‌ వ్యర్థా లను మున్సిపల్‌ వ్యర్థాలతో కలిపితే కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహ కులకు సూచించారు. శుక్రవారం రామగుండం మున్సిపల్‌ పరిధి లోని ఆసుపత్రి నిర్వాహకులతో ఎన్టీపీసీలోని ఈడీసీ మిలీనియం హాల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు డయాగ్నొస్టిక్‌ సెంటర్లు, డెంటల్‌ క్లినిక్స్‌, స్కాన్‌ సెంటర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మున్సి పల్‌ వ్యర్థాలతో బయోమెడికల్‌ వ్యర్థాలను కలిపి పారవేయడం వల్ల మున్సిపల్‌ కార్మికులు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉం దన్నారు. దీని వల్ల పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు.

అన్ని ఆసుపత్రులు ఆధీకృత బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీలతో తప్పనిసరిగా టైఅప్‌ చేసు కోవాలన్నారు. అనంతరం జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆసుపత్రులు ఏజెన్సీతో టైఆప్‌ చేసుకోవాలని, ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్‌ మేరకు బయోమెడికల్‌ వేస్ట్‌ను కలర్‌ కోడ్‌ బిన్స్‌లో వేరు చేసి వేయాలని తెలిపారు. సెగ్రిగేషన్‌ సరిగా చేయకపోతే ఏజెన్సీలు వ్యర్థాలను తీసుకునేం దుకు నిరా కరించే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీ వాహనం రాకపోతే, టైఆప్‌ రెన్యువల్‌ చేసుకోక పోయినా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు సమా చారం ఇవ్వాలని, వారు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లు, ఐఎంఏ సభ్యులు పూర్తి సహకారం అందించాలన్నారు డిప్యూటీ కమిషనర్‌ కృపాబాయి, బయోమెడికల్‌ వేస్ట్‌ ఏజెన్సీ ప్రతినిధి సీష్‌, ఐఎంఏ అధ్యక్షుడు క్యాసాని శ్రీనివాస్‌, వైద్యులు లక్ష్మివేణి, రాపోలు వనజ, దామెర అనిల్‌ కుమార్‌, ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 11:30 PM