Share News

భూ భారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:12 AM

భూ భారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం తహసిల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తులతోపాటు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు.

భూ భారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

కాల్వశ్రీరాంపూర్‌, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): భూ భారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం తహసిల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తులతోపాటు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 105 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి బేస్‌మెంట్‌ స్థాయికి తీసుకురావాలన్నారు. నిరుపేదలు ఉంటే మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లింకేజి లక్ష రుణం పొంది నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ సూచించారు. ఇసుక, ఇతర సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. మండలంలో 134 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే, ఇప్పటి వరకు 110 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. భూ భారతి పోర్టల్‌లో వచ్చే ఆన్‌లైన్‌ దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. మీసేవ ద్వారా పౌరసేవల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో డిస్పోస్‌ చేయాలన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ వనజ, ఓదెల తహసీల్దార్‌ దీరజ్‌ కుమార్‌, ఎంపీడీఓ తిరుపతి, కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ జగదీశ్వర్‌రావు, ఎంపీడీఓ రాంమోహన్‌ పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయండి

ఓదెల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : మండల వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగవంతం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం మండల పరిషత్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా హైస్కూల్లో కలెక్టర్‌ సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల పనులు పూర్తయ్యేవరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మండలంలో 105 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పెండింగ్‌ లో ఉన్నాయన్నారు. ఆరోగ్య కేంద్రంలో ఇన్‌ పేషంట్‌, ఔట్‌ పేషంట్ల రిజిస్టర్లను పరిశీలించారు. కేజీబీవీపీలో నిర్వహిస్తున్న పనులను పరిశీలించి న అనంతరం మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ వనజ, తహసీల్దార్‌ ధీరజ్‌ కుమార్‌, ఎంపీడీవో తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 12:12 AM