భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త
ABN , Publish Date - May 23 , 2025 | 12:28 AM
ఎంవీ భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సం స్కర్త అని, హైదరాబాద్ సంస్థా నంలో సంస్కరణలకు కృషి చేసిన మహోన్న తుడని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.
కోల్‌సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): ఎంవీ భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సం స్కర్త అని, హైదరాబాద్ సంస్థా నంలో సంస్కరణలకు కృషి చేసిన మహోన్న తుడని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. సీపీ మాట్లాడుతూ ఆంధ్రసభ స్థాపకుడిగా హైదరాబాద్‌లో దళిత పాఠశాలను ప్రారంభించి దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశార న్నారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సీ రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఎస్‌బీ ఇన్ స్పెక్టర్ పురుషోత్తం, ఆర్‌ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీహరి, రెవెన్యూ అధికారి ఆంజనేయులు, అకౌంట్స్ ఆఫీసర్ రాజు, ఏఈ చంద్రమౌళి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్‌ఐ పాల్గొన్నారు.