Share News

జ్వరాల బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:49 PM

ఫీవర్‌ కేసులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంథని, రామగిరి మండలాల్లో బుధవారం కలెక్టర్‌ విస్తృతంగా పర్యటించారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి జేబిఎస్‌ స్కూల్‌, జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల స్కూల్‌, గురుకులు పాఠశాలను పరిశీలించారు.

జ్వరాల బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

మంథని/రామగిరి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఫీవర్‌ కేసులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంథని, రామగిరి మండలాల్లో బుధవారం కలెక్టర్‌ విస్తృతంగా పర్యటించారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి జేబిఎస్‌ స్కూల్‌, జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల స్కూల్‌, గురుకులు పాఠశాలను పరిశీలించారు. జెబిఎస్‌ పాఠశాలలో కాంపౌండ్‌ వాల్‌, టాయిలెట్స్‌, కిచెన్‌షెడ్‌ నిర్మాణ పనులు, బాలికల జడ్పీ హెచ్‌ఎస్‌ పాఠశాలలో కాంపౌండ్‌ వాల్‌, టైల్స్‌, అదనపు తరగతి గది నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. రామగిరి మండలంలోని మండల పరిషత్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌, బేగంపేట్‌లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. రత్నాపూర్‌ అప్పర్‌ప్రైమరీ స్కూల్‌లో డీఎంఎఫ్‌టి నిధులు రూ. 9లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులు ప్రారంభించాలన్నారు.

అండర్‌గ్రౌండ్‌ లెవెలింగ్‌లో చేయాలన్నారు. బేగంపేట్‌లోని పాఠశాలలో డయాస్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మంథని ఆసుపత్రికి వచ్చే ఫీవర్‌ కేసులకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని, సీజనల్‌ వ్యాధుల లక్షణాలు గల వారికి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపి సేవలను పెంచాలని, వైద్యులు పూర్తి సమయం అందుబాటులో ఉండాలన్నారు. మంథని ఆసుపత్రి సూపరిండెంట్‌ రాజశేఖర్‌, ఏఈ పిఆర్‌ అనుదీప్‌, ఏఈ వరలక్ష్మి, సంబందింత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:49 PM