Share News

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:01 AM

రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. గురువారం ఐఓసిఎల్‌ సౌజ న్యంతో రూ.40 లక్షలతో మాతా శిశు ఆసుప త్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు కేం ద్రం, రూ.55 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడ కల ప్రత్యేక వార్డు, రూ.12 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజడ్‌ లాండ్రీలను కలెక్టర్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి ప్రారంభించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. గురువారం ఐఓసిఎల్‌ సౌజ న్యంతో రూ.40 లక్షలతో మాతా శిశు ఆసుప త్రిలో ఏర్పాటు చేసిన నవ జాత శిశు కేం ద్రం, రూ.55 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడ కల ప్రత్యేక వార్డు, రూ.12 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజడ్‌ లాండ్రీలను కలెక్టర్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఐఓసిఎల్‌ సంస్థ వారు కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్‌) కింద పలు పరిక రాలతో నవ జాత శిశు కేంద్రం ఏర్పాటు చేశా మన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారని, రిస్క్‌ కేసులను, ప్రీ మెచ్యుర్డ్‌ ప్రసవాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్‌ సూచించారు. మెరు గైన సేవల కారణంగా అవుట్‌ పేషెంట్‌ సంఖ్య 700కు పెరిగిందని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని రకాల ఇన్‌ పేషెంట్‌ సేవలు మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. గర్భిణీల కోసం టిఫ్ఫా స్కానింగ్‌ అందుబాటులో ఉందని, డయాగ్నొస్టిక్‌ హబ్‌ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తు న్నామని, డయాలసిస్‌ కేంద్రం ద్వారా రోజుకు 15 మంది లబ్ధి పొందుతున్నారని కలెక్టర్‌ తెలిపారు. ఆసుపత్రిలో 2డి ఎకో సేవలు కూడా అందు బాటులో వున్నా యని, పైవ్రేటు ఆసు పత్రులలో డబ్బు వృథా చేసుకోవద్దని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ జిల్లా ప్రభు త్వ ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు లభిస్తున్నాయని, ప్రజలు వినియోగిం చుకోవాలన్నారు. నవ జాత శిశువులకు కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, జిల్లా ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అన్న ప్రసన్న కుమారి, పిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:01 AM