సమష్టి కృషితోనే విద్యార్థులకు మెరుగైన విద్య
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:15 AM
ఉపాధ్యాయులు సమష్టిగా పని చేస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య సాధ్యమవుతుందని హైదరా బాద్ ఎన్‌సీఈఆర్‌టీ డిప్యూటీ డైరెక్టర్ రాజేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సాపూర్, రాములపల్లి, సుల్తాన్‌పూర్ గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీ చేశారు.
ఎలిగేడు, సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు సమష్టిగా పని చేస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య సాధ్యమవుతుందని హైదరా బాద్ ఎన్‌సీఈఆర్‌టీ డిప్యూటీ డైరెక్టర్ రాజేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని నర్సాపూర్, రాములపల్లి, సుల్తాన్‌పూర్ గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం, ఐఎఫ్‌పీ ప్యానల్ పనితీరు, విద్యార్థులప్రగతి, విద్యార్థుల సంఖ్యపెంపు, ఫేషియల్ రికగ్నే షన్ అటెండెన్స్ తదితర అంశాలను పరిశీలించారు.
విద్యార్థుల సామ ర్థ్యాలను పరీక్షించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి డిజిటల్ విద్యపై దృష్టి సారించాలన్నారు. తరగతిగదుల్లో ఏర్పాటుచేసిన బోధనో పకరణాలు, పాఠశాలల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని పరిశీలించి అభినందించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాలు విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగాఉన్నాయని హెచ్‌ఎం వెంకటేశ్వర్‌రెడ్డిని అభినందించారు. జిల్లామానిటరింగ్ అధికా రి పిఎంసి, మండల విద్యాధికారి అనసూరి నరేంద్రచారి, ప్రధానో పాధ్యా యులు పులి వెంకటేశ్వర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, శ్రీవాణి, సీఆర్‌పీ లక్ష్మినారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.