Share News

సీజనల్‌ వ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:24 AM

వర్షాకాలం సీజనల్‌ వ్యాధులను నివారించేందుకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి అన్నప్రసన్న కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని డీఎంహెచ్‌వో సందర్శించారు.

సీజనల్‌ వ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలి

ఓదెల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం సీజనల్‌ వ్యాధులను నివారించేందుకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి అన్నప్రసన్న కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని డీఎంహెచ్‌వో సందర్శించారు. ఆసుపత్రికి వస్తున్న రోగులు, అందుబాటులో సిబ్బంది ఉం టున్నారా అనే విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇండ్లల్లో నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

నీటి నిల్వలు ఉన్నట్లయితే ఉపయోగించిన వాహనాల ఆయిల్‌, డీజిల్‌లో చిన్న, చిన్న దుస్తులు తడిపి నీటిలో వేయాలని తెలిపారు. దీని ద్వారా నీటిలో ఉన్న దోమల లార్వా నశిస్తాయని తెలి పారు. రోడ్ల వెంట ఉపయోగం లేని మొక్క లను, చెత్తను తీసివేయాలన్నారు. వైద్య సిబ్బం ది ప్రజలకు అందుబాటులో ఉండి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. గర్భిణులు అత్యవసర సమయంలో 108, 102 వాహనాలను ఉపయోగించుకో వాలని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప త్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా యని తెలిపారు. కార్పొరేట్‌ ఆసుపత్రి కంటే ఎక్కువ సౌకర్యాలు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:24 AM