సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:48 PM
సీజనల్ వ్యాధులపై ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. రవీంద్ర నాయక్ అన్నారు. సుల్తానాబాద్ మం డలం గర్రెపల్లి పీహెచ్‌సీ, సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుప త్రిని సోమవారం సందర్శించారు. గర్రెపల్లి పీహెచ్‌సీ వద్ద డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రసన్న కుమారి డైరెక్టర్‌కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
సుల్తానాబాద్, జూలై 28: (ఆంధ్రజ్యోతి): సీజనల్ వ్యాధులపై ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. రవీంద్ర నాయక్ అన్నారు. సుల్తానాబాద్ మం డలం గర్రెపల్లి పీహెచ్‌సీ, సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుప త్రిని సోమవారం సందర్శించారు. గర్రెపల్లి పీహెచ్‌సీ వద్ద డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రసన్న కుమారి డైరెక్టర్‌కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పీహెచ్‌సీలోని వివిధ విభాగాలను పరిశీలించారు.
గ్రామీణ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు, వైద్య సిబ్బంది తీసుకుంటున్న నివారణ చర్యలను తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై డైరెక్టర్ పలు సలహాలు సూచనలు అందించారు. పీహెచ్‌సీ పరిధిలో అం దుతున్న సేవలు, రికార్డులు పరిశీలించారు. సిబ్బందిని ఉద్ధేశించి మాట్లా డుతు థియరీ జ్ఞానం ఉంటే సరిపోదని, ప్రాక్టికల్‌గా అవగాహన పరిజ్ఞా నం పెంచుకోవాలన్నారు. సుల్తానాబాద్ ఆసుపత్రిని సందర్శించగా సూప రింటెండెంట్ డాక్టర్ రమాదేవి ఆస్పత్రిలోని వివిధ విభాగాలను వివరిం చారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రాజమౌళి, డాక్టర్ వాణిశ్రీ, సుఽధాకర్ రెడ్డి, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.