సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:17 AM
సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తతతో నేరాలను అరికట్టాలని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం కమిషరేట్ కార్యాల యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యం లో ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ అనే కార్యక్రమంలో భాగంగా ఆరు వారాల సైబర్ భద్రత ప్రచార కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.
కోల్‌సిటీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తతతో నేరాలను అరికట్టాలని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం కమిషరేట్ కార్యాల యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యం లో ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ అనే కార్యక్రమంలో భాగంగా ఆరు వారాల సైబర్ భద్రత ప్రచార కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూమ్ సమావేశం ద్వారా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికగోయల్ ఆధ్వ ర్యంలో ప్రారంభ కార్యక్రమం జరిగింది. కమిష నర్ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ ఆరు అం శాలపై ఆరు రోజులపాటు అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తామన్నారు. సైబర్ సారథి ఎట్ 1930, స్కామ్ సే బచావో, పైసా పైలం, హర్ స్ర్కీన్ సురక్షిత్, మేరా లాగిన్ మేరా రూల్, మహి ళ రక్షణ, పిల్లల సంరక్షణ, 1930 హెల్ప్ లైన్, గోల్డెన్ హవర్ రిపోర్టింగ్ ప్రాముఖ్యత, ఏఐ ఆధారిత నివేదన వేగవంతం అంశాలపై కార్యక్ర మాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి పౌరుడు జాగ్ర త్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫ్రాడ్ కా పుల్‌స్టాప్‌లో తెలంగాణలో సైబర్ భద్రతను బలో పేతం చేసే ముఖ్య కార్యక్రమమని సీపీ తెలి పారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోస్ట ర్లు, ఆడియో క్లిప్‌లు ముఖ్య కూడళ్లలో ప్రచా రం చేస్తామన్నారు. సోషల్ మీడియా, ఎన్‌ఎస్‌ఎస్ కెడెట్లు సైబర్ క్లబ్స్ ద్వారా ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు వలంటీర్లను ఎంపిక చేసి ప్రతి కాలేజీ నుంచి ఐదుగురు విద్యార్థులు, ఒక టీచర్‌ను భాగస్వామ్యం చేస్తామన్నారు. కమిషనరేట్‌లో ఒక్కో వారం ఒక్కో టీమ్‌తో అవగాహన కల్పిస్తా మన్నారు. డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఏసీపీ రమేష్, సీసీఎస్ ఏసీపీ రంగారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఎన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.