Share News

పంచాయతీల్లో బీసీలదే ఆధిపత్యం!

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:23 AM

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. అత్యధిక బీసీలు గెలిచిన జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 2019లో జరిగిన ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 21 స్థానాలను అదనంగా దక్కించుకున్నారు.

పంచాయతీల్లో బీసీలదే ఆధిపత్యం!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. అత్యధిక బీసీలు గెలిచిన జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 2019లో జరిగిన ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 21 స్థానాలను అదనంగా దక్కించుకున్నారు. ఈ జిల్లాలో మొదటి నుంచి బీసీల చైతన్యం ఎక్కువే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు కల్పిస్తామన్న హామీ నెరవేరకున్నా కూడా జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం 62.98 శాతం స్థానాల్లో సర్పంచులు గెలుపొందడం విశేషం. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జిల్లాలో గల 262 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, రామగిరి మండలం పెద్దంపేట్‌ పంచాయతీ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. 262 పంచాయతీల్లో 132 పంచాయతీలను జనరల్‌కు, 69 పంచాయతీలను బీసీ లకు కేటాయించారు. జనరల్‌కు కేటాయించిన స్థానాల్లో బీసీలు 96 మంది, ఓసీలు 29 మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీలు నలుగురు సర్పంచులుగా గెలుపొందారు. జనరల్‌ స్థానాల్లో బీసీలు 73.28 శాతం మంది అభ్య ర్థులు గెలిచినప్పటికీ, మొత్తంగా 262 పంచాయతీల్లో బీసీలు 165 మంది 62.98 శాతం సర్పంచులుగా గెలు పొంది బీసీల ఐక్యతను చాటారు. 2019లో జరిగిన పం చాయతీ ఎన్నికల్లో బీసీలకు 70 స్థానాలు కేటాయించగా, ఓసీలకు కేటాయించిన 131 స్థానాల్లో 74 మంది అభ్య ర్థులు, మొత్తం 144 మంది 54.75 శాతం మంది గెలి చారు. గత ఎన్నికల కంటే ఈసారి బీసీల్లో మరింత చైతన్యం పెరిగింది. దాని పర్యావసానమే జనరల్‌ స్థానాల్లో కూడా బీసీలు గెలుపొందడం గమనార్హం. సుల్తానాబాద్‌ మండలం సుద్దాల గ్రామంలో కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఇద్దరు ఓసీ అభ్యర్థులు పోటీ చేయగా, బీఆర్‌ఎస్‌ నుంచి ఒక బీసీ అభ్యర్థి కూడా పోటీ చేశారు. ఓసీ అభ్యర్థుల మఽధ్య హోరాహోరీగా పోటీ జరగగా, అక్కడి ఓటర్లు అనూహ్యంగా బీసీ అభ్యర్థిని గెలిపిం చారు. ఇలా చాలా గ్రామాల్లో ఓసీలు పోటీ చేసిన చోట బీసీలు గెలిచారు. అయితే జనరల్‌కు కేటాయించిన స్థానాల్లో చాలా మంది ఓసీ అభ్యర్థులు పోటీకి దూరంగా ఉన్నారు. ఎన్నికల వ్యయభారాన్ని తట్టుకోలేక కొన్ని గ్రామాల్లో ఓసీలు పోటీ చేసే అవకాశాలను వదులుకుని తమ బీసీ అనుచరులను పోటీలో నిలిపి గెలిపించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఒక్కో పంచా యతీలో సర్పంచ్‌ అభ్యర్థులు పెట్టిన ఖర్చు 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఉం టుందని అంచనా. ఈసారి విచిత్రమేమిటంటే ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో కూడా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఆ స్థానాల్లో కూడా డబ్బులు వెచ్చించారు. బీసీ, జనరల్‌ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు బాగా చేశారు. ఓసీ అభ్యర్థులతో పోటీ పడిన చోట కూడా వారికి దీటుగా డబ్బులు వెచ్చించి గెలుపొందారు. జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా కూడా అభ్యర్థుల గెలపోట ములను బీసీలు శాసిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ముదిరాజ్‌లు, గౌడ్‌, మున్నూరు కాపు, యాదవులు, పద్మశాలి కులస్తులు అధికంగా ఉన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో ఆ సామాజిక వర్గాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు.

ఫ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అవసరమే..

స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అభిప్రా యాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనరల్‌ స్థానాల్లో అత్యధికంగా బీసీ అభ్యర్థులు గెలుపొందినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా గెలిచింది 39.5 శాతమే. 14 జిల్లాల్లో 42 శాతానికి చేరుకోలేదు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేర లేదు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు 2024 నవంబర్‌లో కులగణన చేపట్టడంతోపాటు బీసీ డెడికేషన్‌ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కుల గణనకు కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార కాంగ్రెస్‌ సహ అన్ని పార్టీలు మద్దతు తెలి పాయి. దీంతో ప్రభుత్వం రెండు బిల్లులను గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. ఆర్డినెన్స్‌లు కూడా తీసుకవచ్చినా కూడా కేంద్రం ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోలు తీసుక వచ్చి ఎన్నికలకు వెళ్లింది. దీంతో కొందరు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎన్నికలను నిలిపి వేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే మార్చి నెలాఖరులో 15వ ఆర్థిక సంఘం గడువు ముగుస్తున్నందున స్థానిక సంస్థలకు రావాల్సిన 3వేల కోట్ల రూపాయలు రాకుండా పోతా యని భావించిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఉండే విధంగా ఎన్నికలను నిర్వహించింది. పార్టీ పరంగా 42 శాతం మంది బీసీలకు అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పినప్పటికీ, పార్టీ రహిత ఎన్నికలు కావడంతో జిల్లాలో ఎవరికి వారుగా పోటీ చేశారు. రిజర్వేషన్ల విష యంలో మాత్రం బీసీ సంఘాలు రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరా టాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల సాకుతో మండల, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌ ఎన్నికలను నిర్వహించ వద్దని, హైకోర్టులో రిజర్వేషన్ల అంశంపై తేల్చుకున్న తర్వాతనే ఎన్నికలు నిర్వహించా లని బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - Dec 21 , 2025 | 12:23 AM