అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీలు
ABN , Publish Date - May 28 , 2025 | 11:56 PM
బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు పోరాటం ఆగదని బీసీ ఆజాద్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సం జయ్‌కుమార్ అన్నారు. బీసీ మేల్కొలుపు రథయాత్ర బుధవారం కాల్వశ్రీ రాంపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్ మాట్లాడుతూ దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు సరైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడ్డారన్నారు.
కాల్వశ్రీరాంపూర్, మే 28 (ఆంధ్రజ్యోతి): బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు పోరాటం ఆగదని బీసీ ఆజాద్ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సం జయ్‌కుమార్ అన్నారు. బీసీ మేల్కొలుపు రథయాత్ర బుధవారం కాల్వశ్రీ రాంపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్ మాట్లాడుతూ దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు సరైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడ్డారన్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన వాటా అందించాలని డిమాండ్ చేశారు. కులగణన సాధనకు బీసీలు పోరా డుతున్నా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయన్నారు.
బీసీల అభివృద్ధికి మండల కమిషన్ చేసిన సిఫారసులను తుంగలో తొక్కారన్నారు. బీసీ నాయ కురాలు దాసరి ఉష, బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు బండ నిఖిల్, వడ్డేపల్లి మనోహర్, గుమ్మూల శ్రీనివాస్, జక్కని శ్రీకాంత్, కులసం ఫూల నాయకులు స్వామి, వివేక్‌పటేల్, కోరే కిరణ్, బండారి కొమురయ్య, మేర్గవేన సంపత్, కుమ్మరికుంట రవికుమార్, శారద, పాల్గొన్నారు.