బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:33 PM
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్‌లను అమలు చేయా లని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. ఆదివారం రాణిరుద్రమాదేవి క్రీడాప్రాంగణంలో రన్‌ఫర్ జస్టిస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాణిరుద్ర మాదేవి క్రీడప్రాంగణం నుంచి పన్నూర్ సెంటర్ వరకు రన్ నిర్వహిం చారు.
రామగిరి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్‌లను అమలు చేయా లని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ అన్నారు. ఆదివారం రాణిరుద్రమాదేవి క్రీడాప్రాంగణంలో రన్‌ఫర్ జస్టిస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాణిరుద్ర మాదేవి క్రీడప్రాంగణం నుంచి పన్నూర్ సెంటర్ వరకు రన్ నిర్వహిం చారు. పన్నూర్ కూడలిలో ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్‌లను బీసీ సమాజం కోరుకుంటుందని, న్యాయబద్దమైన రిజర్వే షన్‌లు అమలు చేయాలన్నారు. బీసీ హక్కుల కోసం కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నల్లవెల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్‌లో జేఏసీ జిల్లా అధ్యక్షురాలు ఉష, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు శంకేషి రవీందర్, పూదరిసత్యనారయణగౌడ్, పుల్లేలకిరణ్, దామోర శ్రీనివాస్, నాగెల్లిసాంబయ్య, తగరం శంకర్‌లాల్, ఆసంతిరుపతి, బొంకూరి పోచం, పెద్దసంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.