Share News

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:50 PM

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొ న్నారు. స్వచ్ఛత హీసేవాలో భాగంగా శనివారం రాత్రి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఎకో ఫ్రెండ్లీ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ పాల్గొన్నారు.

 తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

కోల్‌సిటీ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొ న్నారు. స్వచ్ఛత హీసేవాలో భాగంగా శనివారం రాత్రి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఎకో ఫ్రెండ్లీ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రామ గుండం అభివృద్ధిలో జరుగుతున్న మార్పును గమనించి ప్రతి మహిళ అండగా నిలువాలన్నారు. సమాఖ్యలవారీగా బతుకమ్మలకు బహుమతు లు అందజేశారు. శాంతి సమాఖ్య, వెన్నెలసమాఖ్యలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు, తృతీయ బహుమతి సిరివెన్నెల సమాఖ్యలకు లభిం చాయి. అదనపు కమిషనర్‌ మారుతి ప్రసాద్‌, ఈఈ రామన్‌, మెప్మా టౌన్‌ మిషన్‌ కో ఆర్డినేటర్‌ మౌనిక, సీఓలు, పీఆర్‌పీ పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త బాధ్యతతో పని చేయాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ సూచించారు. క్యాంపు కార్యాలయంలో అంతర్గాం, పాలకుర్తి మండలాల ముఖ్య నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త కష్టప డి పని చేయాలని, ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారికి సంక్షేమ కార్యక్రమాలు చేరేలా చూడాలన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 11:50 PM