Share News

బంద్‌ సక్సెస్‌

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:08 AM

బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శని వారం బంద్‌ విజయవంతమైంది. పెట్రోల్‌ బంక్‌లు, సినిమా థియేటర్లు, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుచు కోలే దు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణ ప్రాంగణాలు వెలవెలబో యాయి. రాజకీయాలకు అతీతంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీసీ, కుల సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.

బంద్‌ సక్సెస్‌

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బీసీ సంఘాల బంద్‌ సంపూ ర్ణమైంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ వద్ద రాజీవ్‌ రహదారిపై బైఠాయించి రాస్తారోకో, అంబెద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. కమాన్‌ చౌరస్తాలో బీజేపీ ఆధ్వ ర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్యాన్ని అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ వద్ద రాస్తారోకో చేపట్టగా పోలీసులు మాజీఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల సదాశివ్‌ ఆధ్వర్యంలో బంద్‌ను పర్యవేక్షించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో బస్టాండ్‌ వద్ద బీసీ రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

కళ్యాణ్‌నగర్‌/మార్కండేయకాలనీ, (ఆంధ్రజ్యోతి): బీసీ సంఘాల జేఏసీ బంద్‌ పిలుపు విజయవంతమైంది. ఉదయం 5గంటలకే ఖని ఆర్‌టీసీ డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా బీజేపీ నాయకులు అడ్డుకు న్నారు. ప్రయాణీకులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించడంతో అధిక రేట్లు వసూలుచేశారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌ ఆధ్వర్యంలో ఖని లక్ష్మీనగర్‌లో వ్యాపారస్థులు బంద్‌ పాటించాలని కోరారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమళ్ల మహేష్‌ ఆధ్వర్యంలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించి జ్యోతిరావుపూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బీజేపీ రామగుండం ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో లక్ష్మీనగర్‌లో వ్యాపారులను కలిసి బంద్‌ నిర్వహించాలని కోరారు. టీడీపీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఐ కృష్ణ, ఈదునూరి నరేష్‌, బీసీ సంఘాల నాయకులు నరేష్‌, శ్రీకాంత్‌, కిరణ్‌, రాజేషం, మల్లేషం, కొమురయ్య పాల్గొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మెంటం ఉదయ్‌రాజ్‌ ఆధ్వర్యంలో బంద్‌లో పాల్గొన్నారు.

గోదావరిఖని, (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కపట ప్రేమ చూపుతున్నారని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరో పించారు. బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపు సందర్భంగా కాం గ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో బంద్‌ నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య రంగాలతోపాటు విద్యాసంస్థలు, పెట్రోల్‌ బంక్‌లు, సినిమా హాళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపితే స్పందన రాలేదని, ఈవిషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించినా ఎలాంటి స్పందన లేదని, బీసీ రిజర్వేషన్ల పెంపు బీజేపీకి ఇష్టం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపు విజయవంతమైందన్నారు. నాయ కులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్‌, మాదరబోయిన రవికుమార్‌, కొలిపాక సుజాత, మల్లయ్య, మాదరబోయిన రవికుమార్‌, బొమ్మక రాజేష్‌, గుంపుల తిరుపతి, రాము పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): బీసీలకు రాజ్యాఽధికారం కావాలని ఇచ్చిన పిలుపులో భాగంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్‌గౌడ్‌, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ విజయ వంతమైంది. పట్టణంలో ర్యాలీ అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. పలువురు నేతలు మాట్లాడుతూ బీసీల ఐక్యతను సాధించే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. 42 శాతం రిజర్వేషన్‌ అమలుచేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రావణ్‌ కుమార్‌ బందోబస్తు నిర్వహించారు.

ఓదెల, (ఆంధ్రజ్యోతి): బీసీ జేఏసీ పిలుపు మేరకు బంద్‌ విజయవం తమైంది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొలనూర్‌లో, పొత్కపల్లిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో వేర్వేరుగా రాస్తారోకోలు నిర్వహించారు. పొత్కపల్లి ఎస్‌ఐ రమేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళనలను విరమింపజేశారు. కాంగ్రెస్‌ నాయకు లు గుండేటి ఐలయ్య, బైరి రవీందర్‌ గౌడ్‌, గాజుల శివశంకర్‌, మాటూరు ఎల్లయ్య, తుమ్మల బాపు, మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, రెడ్డి శ్రీనివాస్‌ గౌడ్‌, పోలోజు రమేష్‌, సూత్రాల శ్రావణ్‌ కుమార్‌, చింత వెంకటస్వామి, పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రెడ్డి శ్రీనివాస్‌, తిరుపతి, బోడకుంట నరేష్‌, చింతం వెంకటస్వామి, సూత్రాల శ్రావణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. బీసీ సంఘాల జేఏసీతోపాటు రాజకీయ పార్టీల పిలుపుతో ప్రజలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, బంద్‌లో పాల్గొన్నారు. గాంధీచౌక్‌, అంబేద్కర్‌ చౌక్‌, ఐలమ్మ, శ్రీపాద చౌక్‌, బస్టాండ్‌, పాత పెట్రోల్‌ పంపు చౌరస్తా, కూరగాయల మార్కెల్‌ ఏరియాల్లో షాపులు మూసి ఉంచారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పట్టణ ప్రధాన రహదారిలో ర్యాలీలు నిర్వహించి అంబేద్కక్‌ చౌక్‌లో బైఠాయించారు. అంబేద్కర్‌ చౌక్‌లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పలు కుల వృత్తులను ప్రదర్శించారు. వంటావార్పు నిర్వహించి సామూహిక భోజనాలు చేసి మానవహారం నిర్వహించారు. ఈఆర్‌సీ మెంబర్‌ శశిభూషన్‌కాచే, పీఏసీఎస్‌, ఏఎంసీ చైర్మన్లు కొత్త శ్రీనివాస్‌, కుడుదల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, సెగ్గెం రాజేష్‌, పోలు శివ, బెజ్జంకి డిగింబర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు శంకర్‌లాల్‌, మాచీడి రాజుగౌడ్‌, ఏగోళపు శంకర్‌గౌడ్‌, కనవేన శ్రీనివాస్‌, బీజేపీ నేతలు సంతోష్‌, సంతోష్‌, తిరుపతి, బీసీ సంఘం నేత రామ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:08 AM