Share News

బ్యాలెట్‌ ఓటింగ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:39 PM

సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సొంత ఇంటి పథకం అమలుపై కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం చేపట్టిన బ్యాలెట్‌ ఓటింగ్‌ కార్యక్రమ పోస్టర్‌ను ఆదివారం నాయకులు ఆవిష్కరించారు. ఓసీపీ-3 కృషిభవన్‌, సీహెచ్‌పీలలో జరిగిన కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి కుంట ప్రవీణ్‌ మాట్లాడారు.

బ్యాలెట్‌ ఓటింగ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

యైుటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సొంత ఇంటి పథకం అమలుపై కార్మికుల అభిప్రాయ సేకరణ కోసం చేపట్టిన బ్యాలెట్‌ ఓటింగ్‌ కార్యక్రమ పోస్టర్‌ను ఆదివారం నాయకులు ఆవిష్కరించారు. ఓసీపీ-3 కృషిభవన్‌, సీహెచ్‌పీలలో జరిగిన కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి కుంట ప్రవీణ్‌ మాట్లాడారు.

నాలుగేళ్ళుగా కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని సీఐటీయూ వివిధ రూపాల్లో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో అన్ని యూనియన్లు సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చాయని, గెలిచిన సంఘాలు ఆదిశగా కృషి చేయడం లేదని ప్రవీణ్‌ పేర్కొన్నారు. సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకుండానే సొంత ఇంటి పథకం అమలు సాధ్యమని తెలిపారు. సొంత ఇంటి పథకం అమలు అంశంలో కార్మికుల అభిప్రాయాలను తెలిపేందుకే బ్యాలెట్‌ ఓటింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈనెల 11,12 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా జరిగే ఓటింగ్‌లో కార్మికులు పాల్గొనాలని కోరారు. ఉల్లి మొగిలి, ఎస్‌ వెంకన్న, వినేష్‌, సంపత్‌, సాంబరావు, లక్ష్మీరాజం, రాజేందర్‌, వెంకటనర్సయ్య, సంతోష్‌, మహేందర్‌, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 11:39 PM