Share News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:00 AM

విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల అన్నారు. శనివారం పెద్ద బొంకూరు మదర్‌థెరిస్సా ఇంజనీ రింగ్‌ కళాశాలలో న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల అన్నారు. శనివారం పెద్ద బొంకూరు మదర్‌థెరిస్సా ఇంజనీ రింగ్‌ కళాశాలలో న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత మాట్లాడుతూ నేటి సమా జంలో యువత చెడుమార్గాల బారిన పడుతున్నారని, వాటి పట్ల జాగ్రత్త వహించా లన్నారు.

వాహనాలు నడుపాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుకుంటూనే జీవితంలో స్థిరపడే విధంగా లక్ష్యాన్ని ఎంచుకొని సాధించాలన్నారు. చట్టాలపై అవగాహన ఉంటే గ్రామాల్లో తెలియని వారికి మీరే అవగాహన కల్పించాలన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నాయని వీటి జోలికి పోవద్దన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి స్వప్నరాణి, లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్స్‌ శ్రీనివాస్‌, భాను, న్యాయవాదులు హనుమాన్‌ సింగ్‌, బర్ల రమేష్‌బాబు, ఝాన్సీ, శరత్‌కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ టి.శ్రీనివాస్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:00 AM