ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:42 PM
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబం ధనలు పాటించాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాల కు చేర్చాలని ఎస్సై మధుకర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద డ్రైవర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఎలిగేడు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబం ధనలు పాటించాలని, ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాల కు చేర్చాలని ఎస్సై మధుకర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద డ్రైవర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలో ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దని, డ్రైవర్ సీటు పక్కన కూర్చోరాదని అన్నారు. ఆటోను కండిషన్‌లో ఉంచుకునేలా చూసుకోవాలన్నారు. ప్రమాదం జరిగితే వారిని ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం ఆసుపత్రులకు తరలించి మానవత్వం చూపించాలన్నారు. ఆటోలకు హైఓల్టేజీ బల్బులు అమ ర్చి ఎదురుగా వచ్చే వారికి ఇబ్బందులు కలిగించ వద్దన్నారు. ప్రయాణికులు ఇబ్బందులకు గురైతే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏఎస్‌ఐలు శ్రావణ్ కుమార్, రామచంద్రం, శ్రీనివాస్ ఉన్నారు.