Share News

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:40 PM

రామగుం డం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం ముట్టడికి బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునివ్వడంతో మంగళ వారం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చందర్‌తో పాటు పలువురు నాయకులు మంగళవారం ఉదయమే కళ్యాణ్‌నగర్‌ చౌరస్తా వద్ద వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని మంచిర్యాల జిల్లా జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం

గోదావరిఖని, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రామగుం డం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం ముట్టడికి బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పిలుపునివ్వడంతో మంగళ వారం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చందర్‌తో పాటు పలువురు నాయకులు మంగళవారం ఉదయమే కళ్యాణ్‌నగర్‌ చౌరస్తా వద్ద వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని మంచిర్యాల జిల్లా జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను ఎన్‌టీ పీసీ, యైుటింక్లయిన్‌లో అదుపులో తీసుకొని ఠాణా లకు తరలించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులను సాయంత్రం వదిలిపెట్టారు. మైసమ్మ గుళ్లను కూల్చిన వారిని కఠినంగా శిక్షిం చాలని, సింగరేణి నిర్మిస్తున్న వ్యాపార సముదాయంలో కూల్చివేతలకు గురైన చిరు వ్యాపారులకు ఉచితంగా దుకా ణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్థానిక చౌరస్తా, గాంధీనగర్‌ ఎన్‌టీపీసీ ఏరియాలో చిరు వ్యాపారుల దుకాణా లను కూల్చివేసి వారి కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. ఇక్కడ పోలీసు పాలన నడుస్తోందని శాంతియుతంగా బీఆర్‌ఎస్‌ చేపట్టిన చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని అడ్డగించి బీఆర్‌ఎస్‌ శ్రేణులను అరెస్టు చేయడం దారుణం అన్నారు. బొడ్డు రవీందర్‌, బాదె అంజలి, చెలకల పల్లి శ్రీనివాస్‌, మేడి సదానందం, నారాయణదాసు మారుతి, నూతి తిరుపతి, మేతుకు దేవరాజ్‌, జక్కుల తిరుపతి, దొమ్మేటి వాసు, బుర్రి వెంకటేష్‌, సట్టు శ్రీనివాస్‌, నీరటి శ్రీనివాస్‌, ఇరుగురాళ్ల శ్రావణ్‌, జిట్టవేన ప్రశాంత్‌ కుమార్‌, కిరణ్‌ జీ, చింటూ ఆవునూరి వెంకటేష్‌, ముద్దసాని సంధ్యా రెడ్డి, లక్ష్మి, రాజేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:40 PM