ఏటీసీ సెంటర్‌ను త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:19 AM
పెద్దపల్లి ఐటీఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను నెలా ఖరులోగా పూర్తిచేయాలని లేబర్, ఎంప్లాయిమెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంగళవారం నిర్మాణ పనులను పరిశీలించారు.
పెద్దపల్లి కల్చరల్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి ఐటీఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను నెలా ఖరులోగా పూర్తిచేయాలని లేబర్, ఎంప్లాయిమెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంగళవారం నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ ఆరు ట్రేడ్‌లతో యువతకు ఉపాధి, శిక్షణ అందించేం దుకు నిర్మాణం పూర్తయిన తర్వాత పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి ఐటీఐ కేంద్రం విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఐటీఐ సెంటర్‌కు ఉన్న విద్యుత్ బకాయిలను రూ.15లక్షల 80వేలను త్వరలో మంజూరు చేస్తామన్నారు. ఐటీఐ సెంటర్ ప్రహారీ కూడా మరమ్మతుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అనంతరం ఏటీసీ సెంటర్ ప్రాంగణంలో కలెక్టర్‌తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ మొక్కలు నాటారు. ఐటీఐ ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి వెంకట్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.