Share News

గణేష్‌ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:16 AM

గణేష్‌ నిమజ ్జనానికి ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. శనివారం రాత్రి రామగుం డం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ అరుణశ్రీ అధ్యక్షతన ఎన్‌టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌ సీఎల్‌, కార్పొరేషన్‌, ఫారెస్ట్‌, ఫైర్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

గణేష్‌ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

కోల్‌సిటీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమజ ్జనానికి ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. శనివారం రాత్రి రామగుం డం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ అరుణశ్రీ అధ్యక్షతన ఎన్‌టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌ సీఎల్‌, కార్పొరేషన్‌, ఫారెస్ట్‌, ఫైర్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో 9వ రోజు నిమజ్జనం ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని అధి కారులకు సూచించారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం రోడ్లను వదిలి మండపాలు ఏర్పాటు చేయాలని, రోడ్లపై తవ్వకాలు చేస్తున్నారని, రోడ్లను తవ్వకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు గోదావరి వంతెనపై ఏర్పాట్లు చేయాలని, మండప నిర్వాహకులు విద్యుత్‌ శాఖ అనుమతులు తీసుకోవా లని సూచించారు. విద్యుత్‌శాఖకు చెందిన చాలా వరకు కేబుళ్లు నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, కేబుళ్లను సరి చేసి ప్రమాదాలు జరుగకుండా చూడాలన్నారు. కుల మతా లకు అతీతంగా పండుగలు నిర్వహించుకుని శాంతి యుతంగా గణేష్‌ నిమజ్జనం జరిగే విధంగా సహక రించాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని సూచించా రు. ఏసీపీ రమేష్‌, డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఈఈ రామన్‌, వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, టుటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు, ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌రావు, నాయ కులు మహంకాళి స్వామి పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

రామగుండం నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. రూ.10లక్షలతో 15వ ఆర్థిక సంఘం నిధు లతో కొనుగోలు చేసిన మూడు ఫాగింగ్‌ యంత్రాలను కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామగుండం ప్రజల ఆరోగ్యం కోసం శానిటేషన్‌, దోమల నివారణ కోసం ఫాగింగ్‌ యంత్రాలను కొనుగోలు చేశామని, పట్టణంలో దోమల సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేయాలని, కార్పొరేషన్‌ సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలన్నారు. కమిషనర్‌ అరుణశ్రీ, ఏసీపీ మడత రమేష్‌, ఈఈ రామన్‌, కాంగ్రెస్‌ నాయకులు మహంకాళి స్వామి, ముస్తాఫా, గట్ల రమేష్‌, దూళికట్ట సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 12:16 AM