బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:52 PM
సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులను సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీడీఓలు, ఎంపీవోలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో, నిమజ్జనం చేసే స్థలాలు చదును చేసి, లైటింగ్, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
పెద్దపల్లిటౌన్, సెప్టెంబరు 26 (ఆంఽధ్రజ్యోతి) సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధికారులను సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీడీఓలు, ఎంపీవోలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో, నిమజ్జనం చేసే స్థలాలు చదును చేసి, లైటింగ్, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దసరా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగల సందర్భంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చందపల్లిలో అమృత్ పథకం కింద వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పెద్దపల్లి పట్టణ సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఎమ్మెల్యే ప్రారంభించారు. పట్టణంలో రహదారుల విస్తరణ, సీసీ రోడ్లు, మురికి కాలువలు, డివైడర్స్ నిర్మాణ పనులు పూర్తయితే పట్టణం సుందరంగా మారుతుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం పని చేసే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంపిడిఓలు, ఎంపిఓలు, అధికారులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణం కంచర బావి వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.