అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలి
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:00 AM
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. ఆదివారం ఈసాలతక్కల్లపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆలోచనలు ఉన్నతమైనవన్నారు.
పాలకుర్తి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. ఆదివారం ఈసాలతక్కల్లపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ఆలోచనలు ఉన్నతమైనవన్నారు. అంబే ద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు, సమాజహితమైనవన్నారు. ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన కమిటి సభ్యులను ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో మరికొన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో మహిళల కోలాటాలు, డప్పు చప్పుల్లతో ర్యాలీ తీశారు. వేదికపై దయా నర్షింగ్ బృందం ఆలపించిన గేయాలు ఆకట్టుకు న్నాయి. మక్కాస్ సింగ్ సేవసమితి చైర్‌పర్సన్ మనాలి ఠాకూర్, విగ్రహ సాధన కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, అంబేద్కర్, సమతసైనిక్ రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.