Share News

వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:54 PM

రైతు లు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కొండా లక్ష్మణ్‌ ఉద్యానవన శాఖ విశ్వ విద్యాలయం ఉపకులపతి దండ రాజిరెడ్డి అన్నారు. కూనారంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రం రామ గిరి ఖిల్లా, వ్యవసాయ అనుబంధ శాఖల సహ కారంతో రైతు సదస్సు నిర్వహించారు.

వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

కాల్వశ్రీరాంపూర్‌, నవంబరు3(ఆంధ్రజ్యోతి): రైతు లు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కొండా లక్ష్మణ్‌ ఉద్యానవన శాఖ విశ్వ విద్యాలయం ఉపకులపతి దండ రాజిరెడ్డి అన్నారు. కూనారంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రం రామ గిరి ఖిల్లా, వ్యవసాయ అనుబంధ శాఖల సహ కారంతో రైతు సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 20 లక్షల విస్తీ ర్ణంలో వరి పండిస్తున్నారని, వరికి కిలోకు 300 లీటర్ల నీటి అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే సరిపోతుందన్నారు. కూరగా యలు, కందులు, గోధుమలు, నువ్వులు, మక్కలు, శనిగలు, ఇతరత్రా పంటలు వేయాలని రైతులకు సూచించారు. ఐదు పంటలు పండించవచ్చని, కానీ రైతులు వరి, పత్తి రెండు పంటలు మాత్రమే సాగు చేస్తున్నారన్నారు. అధికంగా పురుగు మందులు వాడితే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందన్నారు. బయో ఫెర్టిలైజర్‌ మందులను విరివిగా ఉపయోగించాలని సూచించారు. గతంలో కూరగాయలు, పెసలు, కం దులు పండించిన మన రాష్ట్రం ప్రస్తుతం రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొం దన్నారు. కూరగాయల సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. తాను కూనారం జన్మించి వ్యవసాయం చేస్తూ చదువుకున్నానని, చిన్న తనంలో 1965లో పంటలు సరిగా పండకపోవడం వల్ల హరితవిప్లవం వచ్చిందన్నారు. ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావుతో కలిసి కోరమండల్‌ ఇం టర్నేషనల్‌ వారి ఆర్థిక సహాయంతో గ్రామపంచా యతీ కార్యాలయంలో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిం చారు. కోరమండల్‌ వైస్‌ చైర్మన్‌ జీవీ సుబ్బారెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్‌, మాజీ సర్పంచ్‌ డొంకన మొగిలి, ఏఎంసీ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 11:54 PM